కాకతీయ, తెలంగాణ బ్యూరో : యువతకు ఈ-కామర్స్ శిక్షణ కావాలని లోక్‌సభలో డాక్టర్ కడియం కావ్య ప్రశ్నించారు.?, గ్రామీణ యువతకు ఈ-కామర్స్ (ఆన్‌లైన్ వ్యాపారం) శిక్షణను మరింత విస్తరించాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య లోక్‌సభలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖను కోరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జయంత్ చౌదరి 2022-23లో వరంగల్‌లో 170 మందికి ఆన్‌లైన్ వ్యాపారం, డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ అందించామని తెలిపారు. తెలంగాణలో 2025 జూలై వరకు 25 వన్ ధన్ వికాస్ కేంద్రాల ద్వారా 1,461 మందికి శిక్షణ ఇచ్చి, గిరిజన కుటుంబాల ఆదాయం పెంచినట్లు పేర్కొన్నారు. 2025-26లో 30 మందికి సౌర విద్యుత్ వ్యాపారంపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.
మార్కెట్ యాక్సెస్ కోసం ఒప్పందాలు..
మార్కెట్ యాక్సెస్ కల్పించేందుకు 2024 ఆగస్టు 13న ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓ ఎన్ డి సి ), గవర్నమెంట్ ఈ-మార్కెట్‌ప్లేస్ (జెమ్ )తో, అలాగే 2023 సెప్టెంబర్ 4న మెటా సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి వివరించారు. తెలంగాణలో ఈ-కామర్స్ శిక్షణను విస్తరించాలన్న డిమాండ్‌ను మరోసారి ముందుకు తెచ్చిన డాక్టర్ కడియం కావ్య, దీతో గ్రామీణ–గిరిజన యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కలగడంతో పాటు, స్థిరమైన ఆదాయం అందుతుందని చెప్పారు.


