రామాలయంలో కార్తీక వన భోజనాలు
ఆలయ ప్రాంగణంలో సకల దేవత పారాయణం
ప్రధాన అర్చకులు పర్ప తప్పు శివప్రసాద్ శాస్త్రి
కాకతీయ,ఖానాపురం : పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకొని మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు పర్వతపు శివప్రసాద్ శాస్త్రి ఆధ్వర్యంలో సకల దేవతా పారాయణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పారాయణ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన కార్తీకమాస వనభోజనాలను ఆలయ కమిటీ చైర్మన్ గొల్లపూడి సుబ్బారావు ప్రారంభించారు. ఆలయంలో నిర్వహించిన వన భోజనానికి గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.


