ప్రజల విశ్వాసాన్ని పొందిన పత్రికా రంగం
అది సమాజానికి మార్గదర్శకం
టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి
ఖమ్మం ప్రెస్ క్లబ్ లో జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలు
కాకతీయ, ఖమ్మం : ప్రజాస్వామ్య దేశంలో పాత్రికేయ రంగం సమాజానికి మార్గదర్శకం అని, బ్రిటీష్ కాలం నుండి పత్రికా రంగం ప్రజల విశ్వాసాన్ని పొందిందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (పాత్రికేయ రంగం సమాజానికి మార్గదర్శకం) జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఆదివారం జాతీయ పత్రిక దినోత్సవ వేడుకలను ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుద్దేటి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రవి, గుద్దేటి రమేష్ బాబు మాట్లాడారు. అనాదిగా పాత్రికేయ రంగం సమాజానికి మార్గదర్శకంగా ఉండి వారు అందిస్తున్న వార్తలు పత్రిక రూపంలో ప్రజల మన్నులను పొందుతున్నాయని అన్నారు. 1966లో జస్టిస్ జె.ఆర్ ముధోల్కర్ నేతృత్వంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) ఏర్పడిందని, అదే ఏడాది నవంబరు 16 నుంచి ఇది పని చేయడం ప్రారంభించిందని అన్నారు. జర్నలిస్టులు బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వహిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా నగర అధ్యక్షుడు యలమందల జగదీష్, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, కోశాధికారి బిక్కి గోపి, జర్నలిస్ట్ నాయకులు కూరపాటి నరేష్, ఇసంపల్లి వెంకటేశ్వర్లు, ఎస్.డి యాదగిరి, శ్రీధర్, రోజా, ఉల్లోజు రమేష్, పెంటి వెంకటేశ్వర్లు, పులి శ్రీనివాస్, ఉపేందర్, కొండల్, కెమెరామెన్ శంకర్, శంకర్, పానకాలరావు, జీవన్ రెడ్డి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


