20 ఏళ్ల నిరీక్షణకు తెర
ఫలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృషి
నారాయణపూర్ నిర్వాసితులకు రూ.23.50 కోట్లు మంజూరు
కాకతీయ, కరీంనగర్: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కారణంగా ముంపునకు గురైన గంగాధర మండలం నారాయణపూర్, మంగపేట, చెర్లపల్లి (ఎన్) గ్రామాల నిర్వాసితుల 20 ఏళ్ల నిరీక్షణకు చివరికి తెరపడింది. నిర్వాసితుల పరిహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.23.50 కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో గ్రామాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.గత ప్రభుత్వ కాలంలో పరిహారం అందజేయడంలో నిర్లక్ష్యం జరిగిందని, అందువల్ల నిర్వాసితులు సంవత్సరాల తరబడి ఎదురుచూసినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పరిహారం తప్పకుండా అందిస్తానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇచ్చిన హామీ ప్రకారం, సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాక, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని నారాయణపూర్‌కు తీసుకువెళ్లి ముంపు బాధితుల పరిస్థితిని ప్రత్యక్షంగా చూపించారు.ప్రభుత్వం పరిహారం విడుదల చేయడంతో మూడు గ్రామాల నిర్వాసితులు ఆదివారం మధురనగర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ఆనందం వ్యక్తం చేశారు. తమ సమస్యలను అర్థం చేసుకొని పరిహారం మంజూరు చేసిన సీఎం, మంత్రికి, అలాగే కృషి చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యానికి నిర్వాసితులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తీర్మల్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, బుచ్చన్న, రామిడి రాజిరెడ్డి, బుర్గు గంగన్న, సాగి అజయ్ రావు, సత్తు కనుకయ్య, కర్ర విద్యా సాగర్, తోట సంధ్య, కవిత, వేముల అంజి, బాపు రెడ్డి, మేర్జ కొండయ్య, స్వామి, దికొండ మధు, నగేష్, కొల ప్రభాకర్, మ్యాక వినోద్, మహేష్, గంగివేణి నవీన్ తదితరులు పాల్గొన్నారు


