కార్యకర్తలకు అండగా సేవాదళ్
వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దుగ్గొండి మండల కాంగ్రెస్ కమిటి
మహిళా కమిటీ అధ్యక్షురాలుకు పదివేల ఆర్థిక సహాయం
కాకతీయ, దుగ్గొండి: ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి ఆర్ధిక సహాయం అందించేందుకు వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విన్నత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం మండలంలోని మల్లంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రేస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు వెండి సక్కుబాయి కంటి ఆపరేషన్ చేయించుకోగా ఆమెను మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలసి పరామర్శించి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అనంతరం మండలాధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆదేశాలతో సేవాదళ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, కష్టకాలంలో ఉన్న మండలంలోని ప్రతీ కార్యకర్తకు సహాయం అందించేందుకు సేవాదళ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ప్రతి కార్యకర్త కష్ట సుఖల్లో మండల కమిటీ పలుపంచుకుంటుందని ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని తెలిపారు. కార్యక్రమంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ హింగే రామరావు, మాజీ ఎంపీపీ బూరుగు రవీందర్, యూత్ మండల అధ్యక్షులు కొత్తకొండ రవివర్మ, మండల ప్రచార కార్యదర్శి కూరతోట సురేష్, నర్సంపేట బ్లాక్ కాంగ్రేస్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యాగం శివాజీ, మండల నాయకులు బండారి ప్రకాష్, గన్న ప్రమోద్, దారావత్ రాజు, శెంకశి రమేష్, ఇజ్జగిరి నరేష్, అల్లాపురం ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.


