ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం
ఎమ్మెల్యే కవ్వంపల్లి
కాకతీయ, కరీంనగర్ : కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కలలు నెరవేరుతున్నాయని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. నర్సింగాపూర్‌కు చెందిన లబ్ధిదారు పెరుక శివాని కొత్త ఇంటి గృహప్రవేశంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఇళ్లు దక్కలేదు. పేదల గూర్చి ఆ ప్రభుత్వానికి పట్టింపు ఉండేది కాదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వాస్తవంగా పేదల సొంతింటి కలను నెరవేర్చుతోంది అన్నారు.కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ గౌడ్, మండల అధ్యక్షుడు బండారి రమేష్ గౌడ్, మోరపల్లి రమణారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, శ్రీగిరి రంగారావు, గోపు మల్లారెడ్డి, బుధారపు శ్రీనివాస్, మామిడి అనిల్, పోలు రాము, అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ విజయం నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదివారం అలుగునూరు శ్రీ స్వయంభూ లక్ష్మీ గణపతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రమేష్ యాదవ్, గోపు మల్లారెడ్డి, మోరపల్లి రమణారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, శ్రీగిరి రంగారావు, కంది రవీందర్ రెడ్డి, కంది అశోక్ రెడ్డి, చిందం కిష్టయ్య, సిరిసిల్ల చంద్రయ్య, నేరెళ్ల జంపయ్య తదితరులు పాల్గొన్నారు.



