ఆధునిక యంత్రాలతో వ్యవసాయం మరింత లాభసాటి..ప్రణవ్..
డ్రోన్ స్ప్రే పై రైతులకు అవగాహన కల్పించాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం.
కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణంలో ఆధునిక కాలంలో రైతులకు డ్రోన్ స్ప్రే పై అవగాహన కల్పించి,వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా తీర్చిదిద్దాలని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.ఆదివారం రోజున జమ్మికుంట పట్టణంలోని డ్రోన్ స్ప్రే నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా డ్రోన్ స్ప్రే వలన కలిగే లాభాలు,రైతుకు ఏ విధంగా వీటి వాడకం వల్ల ఉపయోగం కలుగుతుందో తెలియజేయాలని నిర్వహుకుణ్ణి కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని,ఇలాంటి ఆధునిక యంత్రాలతో రైతులకు మరింత లాభసాటిగా చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.



