ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు
ఇద్దరు ప్రయాణికుల మృతి
జనగామ జిల్లా నిడిగొండ వద్ద ఘెర ప్రమాదం
అర్ధరాత్రి సమయంలో ఘటన
హైదరాబాద్ నుంచి వస్తున్న బస్సు ఢీ కొట్టిన లారీ
కాకతీయ, వరంగల్ బ్యూరో : ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. ఈ సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగింది. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ రాజధాని బస్సు నిడిగొండ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో హన్మకొండకు చెందిన దిండిగల్ కు చెందిన కులమాల ఓం ప్రకాష్, హనుమకొండ కు చెందిన నవదీప్ సింగ్ లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే కారణంగా తెలుస్తోంది. రఘునాథపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అర్ధరాత్రి జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం… లారీ రాజధాని బస్సు ఢీకొని ఇద్దరు ప్రయాణికులు మృతి… నిడిగొండ జాతీయ రహదారులో… రఘునాథపల్లి.. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారుల గల రఘునాథపల్లి మండలం నిడి గొండ గ్రామ జాతీయ రహదారిలో రాత్రి 1:30 గంటలకు హైదరాబాద్ నుండి వరంగల్ వస్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ లారీని అది వేగంగా ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు పలువురికి గాయాలు రోడ్ ఎక్కాలంటే ప్రయాణికులు భయపడే పరిస్థితి నెలకొంది.

.


