బీజేపీ శ్రేణుల సంబరాలు
కాకతీయ, తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో స్థానిక గెస్ట్ హౌస్ సెంటర్ వద్ద బీజేపీ తొర్రూరు అర్బన్ అధ్యక్షుడు పైండ్ల రాజేష్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లె కుమార్, జిల్లా మాజీ కార్యదర్శి, మాజీ కౌన్సిలర్ కొలుపుల శంకర్, ఎస్సీ మోర్చా నాయకులు అలిసేరి రవిబాబు, మంగళపళ్ళి యాకయ్య, గడల శేఖర్, తూర్పాటి సాయి ముకేష్, గంధం రాజు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కాగు నవీన్, మండల ప్రధాన కార్యదర్శులు నడిగడ్డ సందీప్, కొండా యాకన్న, బీజేవైఎం జిల్లా కాలేజీ అవుట్ రీచ్ కన్వీనర్ నూకల నవీన్, మండల పదాధికారులు జలగం రవి, గుండా సురేష్, గట్ల భరత్, తాటి జగదీష్, ధరావత్ తేజస్, శోభారాణి, సర్వి వెంకటేష్, నర్కుటి శివ గణేష్, తూర్పాటి మోహిత్, రాజ్ కుమార్, బొల్లు ప్రవీణ్, మక్తాల రమేష్, బబ్లూ, తదితరులు పాల్గొన్నారు.


