మృతుడి కుటుంబానికి పెయింటర్ల సాయం
కాకతీయ, పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన పెయింటర్ గాయాల సతీష్ ఇటీవల మరణించాడు. కాగా అతని దశదిన కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించినట్లు పాలకుర్తి శ్రీసోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి పెయింటర్ యూనియన్ మండల గౌరవ అధ్యక్షుడు గాదెపాక భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనియన్ లో సభ్యత్వం తీసుకున్న పెయింటర్లకు ఎలాంటి ఆపద వచ్చినా తమవంతు సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఇరుగు అశోక్, కోశాధికారి గ్యార సురేష్, మండల ప్రచార కర్త పాలడుగు ప్రశాంత్, గాదెపాక మల్లేష్, గాయాల రవి, తూటి పరుశరాములు, గాదెపాక కుమార్, గాదెపాక హరీష్, వంగాల అశోక్, బండిపెల్లి కృష్ణ, గాదపాక ఎల్లేష్, యాటల మహేష్, గాయాల సాయి కుమార్ పాల్గొన్నారు.


