పనుల్లో నాణ్యత పాటించేలా చూడండి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్
కాకతీయ, వరంగల్ : నగరంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు.
శనివారం నగర పరిధిలోని ఉనికిచర్ల, మడికొండ, తరాలపల్లి, సిద్దార్థ నగర్ ప్రాంతాల్లో పూర్తి ఐన అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా 46వ డివిజన్ ఉనికిచర్ల ప్రాంతంలో నూతనంగా నిర్మించిన సిసిరోడ్డుతో పాటు స్మశాన వాటికలో ఏర్పాటు చేసిన బర్నింగ్ ప్లాట్ ఫాం, నీటి సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన బోర్ ప్రహరీ గోడ పనులను, 64వ డివిజన్ మడికొండ ప్రాంతంలో గ్రావెల్ రోడ్డు పనులను, తరాలపల్లిలో సిసి రోడ్డు, సిద్దార్థ నగర్ లో కమ్యూనిటీ హాల్ తో పాటు 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన అర్బన్ ఆరోగ్య కేంద్ర (యుపిహెచ్సి) నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకొన్నారు. వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో ఈఈ రవి కుమార్, డిఈ రవి కిరణ్, ఏఈ రామన్న, వర్క్ ఇన్సెక్టర్ తదితరులు పాల్గొన్నారు.


