సేద్యపు నీటి కుంటలతో రైతులకు మెరుగైన లాభాలు
వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారాద
కాకతీయ, దుగ్గొండి: సేద్యపు నీటి కుంటలతో రైతులకు మెరుగైన లాభాలు పొందవచ్చునని జిల్లా కలెక్టర్ డా,, సత్య శారాద దేవి అన్నారు. శనివారం దుగ్గొండి మండలంలోని తొగర్రాయి గ్రామంలో కౌలు రైతు కొత్తపెల్లి రమేష్ గత సంవత్సరం మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా వ్యవసాయ క్షేత్రం వద్ద ఏర్పాటు చేసుకుని వ్యవసాయానికి వినియోగిస్తున్న సేద్యపు కుంట (ఫాం ఫండ్) ను కలెక్టర్ పరిశీలించి, నిర్వహణ తిరును ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు. మండలంలో పది వేలకు పైన ఇంకుడు గుంతలు, సేద్యపు కుంటల నిర్మాణం చేయడంతో మండల అధికారులు, ఈజియస్ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. వ్యవసాయానికి అనుసంధానంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సద్వినియోగం చేసుకొని కూరగాయలు, పండ్ల తోటల పెంపకం చేయాలయని రైతులకు సూచించారు. అనంతరం ఇటీవల తుఫాను ప్రభావంతో పాడైన పత్తిని చేనులో కాయలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవస్యాయ సహాయ సంచాలకులు అనురాధ, డిఎం సివిల్ సప్లైస్ సంధ్యారాణి, జిల్లా పౌరసరపరాల అధికారి కిష్టయ్య, ఎపిడి శ్రీవాణి, తహసీల్దార్ రాజేశ్వర్ రావు, ఎంపీడీఓ అరుంధతి, ఏపిఓ శ్రీనివాస్, ఈసీ రాజు, టిఏ సమ్మయ్య, పంచాయితీ కార్యదర్శి వాణి తదితరులు పాల్గొన్నారు.



