విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్స్ వితరణ
కాకతీయ, జూలూరుపాడు: మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు చిరాకు ఫౌండేషన్ ఎన్ ఆర్ ఐ సంస్థ వారు పదవ తరగతి చదువుకుంటున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్స్ 42 మంది విద్యార్థినీ విద్యార్థులక వితరణ చేసినారు పదవ తరగతి లో మంచిమార్కులతో పాస్ అవ్వటానికి చక్కటి స్టడీ మెటీరియల్ను ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం విద్యార్థులకు 42 మంది విద్యార్థులకు సుమారుగా 12 వేల రూపాయల విలువ కలిగినటువంటి స్టడీ మెటీరియల్ను చిరాగ్ ఇంటర్నేషనల్ ఎన్ ఆర్ ఐ సంస్థ వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని, కొత్తగూడెంలో ఆ సంస్థ ఆర్గనైజింగ్ సెక్రటరీ పార్వతమ్మ మరియు సంధ్యారాణి వారి యొక్క ప్రోత్సాహంతో ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు సురపనేని శాంత కుమారి సహకారంతో విద్యార్థిని, విద్యార్థులకు అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి సులభతరమ్మగా పాస్ అవుటకు ఆల్ ఇన్ వన్ గైడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు టి లక్ష్మీ నర్సయ్య మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించి మీరు చదువుకున్న పాఠశాలకు రుణం తీర్చుకునేలా భవిష్యత్తులో ఎదగాలని నలుగురికి సహాయపడాలని సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని,తల్లిదండ్రులకు,గురువులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అదేవిధంగా మీ గ్రామానికి చక్కటి పేరు,నలుగు కి సహాయప డేల ఉండాలని విద్యార్థిని విద్యార్థులకు ఉపదేశించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు రామశెట్టి శ్రీనివాసరావు,నిమ్మగడ్డ ఉమా, నండ్రు గురుమూర్తిగ,గుడిపూడి వెంకటేశ్వర్లు,ఉమా మహేశ్వరి,లలితా మేడం,అరుణకుమారి,బోడా కృష్ణ,ప్రతాప రెడ్డి, ఉదయ సేత్, ఉపేంద్రమ్మ పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలియ చేసినారు.


