హలో మాల.. ఛలో ఢిల్లీ కరపత్ర ఆవిష్కరణ
కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని రవిరాల గ్రామంలో జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షులు కారం ప్రశాంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి జాతీయ మాల మహానాడు జిల్లా ఇంచార్జ్ చిట్టిమల్ల సమ్మయ్య, జాతీయ కార్యదర్శి ఆశోద భాస్కర్ హాజరై హలో మాల చలో ఢిల్లీ సంబంధించిన కరపత్రాన్ని శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత పార్లమెంట్ కు డా,,బీ.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని, అసంఖ్య బద్ధంగా చేసిన ఎస్సీ వర్గీకరణ రద్దు చేసి ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని 20 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రావిరాల గ్రామ అధ్యక్షుడు ఆరే ఐలయ్య, ఆరే రమేష్, దాసరి యాకయ్య, జెగటి ఐలయ్య, మెరుగు వెంకన్న, పబ్బ సూర్య ప్రకాష్, మండలి సతీష్, మండలి హరీష్, మండలి ఉపేంద్ర, మండలి సుజాత, ఉమ ,శోభ
తదితరులు పాల్గొన్నారు.


