బాధిత కుటుంబానికి పరుపాటి చేయూత…
కాకతీయ,రాయపర్తి : మండల కేంద్రానికి చెందిన ఆకారపు కమలమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత,బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాసరెడ్డి కమలమ్మ కుటుంబ సభ్యులకు చేయూతనందించి అండగా నిలిచారు.ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న చిన్నాల వెంకటమ్మ,మెండే వెంకన్నను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు,లేతాకుల రంగారెడ్డి, ముద్రబోయిన సుధాకర్,చందు రాము,సతీష్,ఎండి అక్బర్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.


