కేజీకేఎస్ జిల్లా ఉపాధ్యక్షునిగా రామన్న
కాకతీయ,నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కిరాణా వర్తక ఫంక్షన్ హల్లో కల్లు గీత కార్మిక సంఘం మూడవ జిల్లా మహాసభ సమావేశం శనివారం రోజున జరిగింది.సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు యంవి.రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు హాజరయ్యారు.వీరి ఆధ్వర్యంలో జిల్లా కల్లుగీత కార్మిక సంఘ నూతన కమిటీలో జిల్లా ఉపాధ్యక్షునిగా డోనికెన రామన్న నుఏకగ్రీవంగాఎన్నుకున్నారు.ఈసందర్భంగా నూతన కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు డొనికెన రామన్న మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నుకకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కల్లుగీత కార్మిక సంఘం హక్కుల సాధన కోసం పోరాడతానని,గీతా కార్మికుల ఐక్యత కోసం కృషి చేస్తా నన్నారు.ఈకార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర సలహాదారు గునిగంటి మోహన్,
నర్సింహులపేట కార్యదర్శి చిర్ర సతీష్ గౌడ్,లింగన్న,కుల అధ్యక్షులు డొనికెనజంపన్న, దయాకర్,సీతారాములు,పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


