సహకార సంఘాలతోనే రైతుల అభివృద్ధి…
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి..
కాకతీయ,ఆత్మకూరు : సహకార సంఘాలు బలంగా ఉంటేనే రైతులు ఆనందంగా ఉంటారని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.శనివారం ఆత్మకూరు మండలంలోని పెంచికలపేట పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఫార్టిలైజర్ గోదాం డ్రై షెడ్ కు భూమి నిర్వహించి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు రైతుల పై దేశ ఆర్ధిక పరిస్థితి పై ఆధారపడి ఉందని అలాంటి రైతులకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. రైతులను అభివృద్ధి చెందడంలో సహకార సంఘాలు ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. సహకార సంఘాలల్లో రైతులకు ఎరువులు, విత్తనాలు, బ్యాంకింగ్, తదితర ఆన్ లైన్ ద్వారా మరిన్ని సేవలు అందిస్తారని రైతులకు తెలిపారు. ఇదే పూర్తిగా తీసుకొని డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసి మహిళాలకు బ్యాంకుల్లో తక్కువ వడ్డీలకే రుణాలు ఇప్పించి మహిళా సాధికార లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. మహిళల ఆర్థిక వ్యవస్థను పరకాల మహిళా డైరీ ఏర్పాటుకు కృషి చేస్తుందని, రైతు కుటుంబాలు గౌరవంగా ఉండాలంటే, సహకార సంఘాలు బలోపేతం కావలసి ఉందన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలను అందించడం, రైతులకు సాగు విధానం, ఆధునిక వ్యవసాయం, తదితరా అంశాలకు సహకార సంఘాలు ఏర్పారాచడంలో తోడ్పడతాయన్నారు. రైతులు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. సకాలంలో పెంచికలపేట పిఎసిఎస్ భవనాన్ని పూర్తిచేసి, రైతులకు ఉపయోగపడేలా కృషి చేసినందుకు పాలకవర్గాన్ని అభినందించారు. అభివృద్ధిలో రాజకీయాలు వద్దు అని, పనిచేసే వారికి రాజకీయాలకతీతంగా ప్రోత్సహిస్తానని అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డి సి ఓ సంజీవరెడ్డి, నాబార్డ్ డిడిఎం చంద్రశేఖర్, డీసీసీబీ సీఈవో వజీర్ సుల్తాన్,పిఏసియాస్ చైర్మన్ కంది శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బీరం సునంద సుధాకర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు కమలాపురం రమేష్,ఆత్మకూరు మాజి సర్పంచ్ పర్వతగిరి రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు,నీరుకుళ్ళ మాజి ఎంపీటీసీ అర్షం వరుణ్ గాంధీ,ఆత్మకూరు మాజి పిఏసిఎస్ చైర్మన్ ఎరుకొండ రవీందర్ గౌడ్,పిఏసియాస్ డైరెక్టర్ ఉడుత రాజేందర్,మాజి జడ్పీటీసీ కక్కెర్ల రాధిక రాజు,కాంగ్రెస్ఉ మండల నాయకులు ఉడుత మహేందర్,యూత్ అధ్యక్షుడు సందీప్,తదితరులు పాల్గొన్నారు.



