స్ఫూర్తి శిఖరం బిర్సా ముండా
ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు
గొండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో…
కాకతీయ, నూగూరు వెంకటాపురం : ఆదివాసీ హక్కుల తొలి పోరాటయోధుడు బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను శనివారం కమ్మరిగూడెం గ్రామంలో గొండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.గొండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి ములుగు జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ బిర్సాముండా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.
అనంతరం నాయకులు పూనెం సాయి, పూనెం ప్రతాప్ మాట్లాడుతూ నాడు బ్రిటిషర్లు అరాచకాలను ఎదిరించిన ఆదివాసీ యోధులు బీర్సా ముండా అని,తన పోరాట పటిమతో ఆంగ్లేయులకు చెమటలు పట్టించిన బిర్ష ముండా చిన్నవయసులోనే కన్నుమూసిన ,పది కాలాల పాటు అందరూ గుర్తు పెట్టుకునేలా బ్రిటిష్ వాళ్ళతో పోరాటం సాగించాడని గుర్తు చేశారు.ఆనాటి బ్రిటిష్ దాష్టికాల్ని ఎండగట్టి ఆదివాసులను సమీకరించి,వారిని చైతన్యవంతులను చేశాడని అన్నారు.ఆదివాసీల సమూహాన్ని ఏర్పాటు చేసి, అడవి బిడ్డల ఆరాధ్య దైవంగా బిర్సా ముండా పేరొందాడని కొనియాడారు.ఆదివాసీ ప్రతిఘటన ప్రమాదాన్ని గుర్తించిన బ్రిటీషు పాలకులు ఆయన్ను అరెస్టు అరెస్టు చేసి విషప్రయోగం చేసి హతమర్చారని తెలిపారు.ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నేటి తరం ఆదివాసీ హక్కుల కోసం కంకణం కట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గొండ్వాన గ్రామ పెద్దలు పూనెం నాగేశ్వరావు,పర్షిక మోహనరావు కార్యకర్తలు పర్షిక బాబురావు,వెంకటేష్,దిలీప్, రాజేష్, పార్థు,జస్వంత్, సబక సమ్మయ్య,తదితరులు పాల్గొన్నారు


