కాకతీయ, వెబ్‌డెస్క్: దేశంలో వంట నూనెల లోటును పూడ్చేందుకు ములుగు జిల్లా ఇంచర్ల శివారులో ప్రైవేట్ కంపెనీతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇందుకోసం 12 ఎకరాల భూమిని కేటాయింది. ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసేందుకు సోమవారం మంత్రులు రాష్ట్ర వ్యవసాయం, మార్కెటింగ్ , సహకారం, చేనేతలు, వస్త్రాలు శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు జిల్లా కేంద్రానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు ఆయిల్ ఫెడ్, చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మర్యాదపూర్వకంగా పూల మొక్కను అందచేసి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటి చైర్మన్ రేగ కళ్యాణి, ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయిల్ పామ్ పండించే రైతుల కల సాకారం కానుంది. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ పంటను పండించాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో రైతులకు అవగాహన కల్పించిన నేపథ్యంలో ఇక్కడ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు.




