ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు
కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరుగుతున్న రహదారి ప్రమాదాల నివారణకై పోలీస్,మున్సిపల్,అర్&బీ అధికారుల సమిష్టి కృషితో చర్యలు తీసుకున్నట్లు మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక గద్దె రాగడి రహదారిపై పోలీస్,మున్సిపల్,అర్&బీ శాఖల ఆధ్వర్యంలో ప్రమాద స్థలాలను (బ్లాక్ స్పాట్) లను గుర్తించారు. ఈ సందర్బంగా సీఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస గార్డెన్ నుంచి బొక్కల గుట్ట క్రాస్ వరకు వాహనాల వేగాన్ని అదుపు చేస్తే ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్స్,సూచిక బోర్డులతో పాటు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పశువులను రహదారులపై ఇష్టానుసారంగా వొదిలితే యాజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు. పట్టణ ఎస్సై జీ.రాజశేఖర్,మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు,ఏఈ ఆశ్రిత్,అర్&బీ అధికారులు,ట్రాఫిక్ పోలీసులు,సిబ్బంది పాల్గొన్నారు.


