రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన శుక్రవారం సాయంత్రం నర్సంపేట -వరంగల్ ప్రధాన రహదారిపై దుగ్గొండి మండలం గిర్నిబావి వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గీసుగొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన గద్దె అమ్మాయమ్మ (55) ఆమె భర్త గోపాల్ రావుతో కలసి లక్నెపల్లి ఫంక్షన్ కు వెళ్తుండగా మార్గం మధ్యలో గిర్నిబావి భారత్ పెట్రోల్ పంపు సమీపంలో వెనకనుండి వచ్చిన లారీ టూ వీలర్ డీ కొనడంతో రోడ్డు పై పడిన అమ్మయమ్మ పై నుండి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటన స్థలికి చేరుకున్న ఎస్సై మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నర్సంపేట మార్చురికి తరలించారు.


