కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు
కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంతో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయోత్సవ సంబరాలు శుక్రవారం జరిపారు. స్థానిక సూపర్ బజార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోఎన్.ఎస్.యూ.ఐ,యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో బాణాసంచా కాల్చి,మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. పిసిసి సభ్యులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి వోడ్నాల శ్రీనివాస్,గాండ్ల సమ్మయ్య,మాజీ వైస్ చైర్మన్ విద్యా సాగర్,రాజేష్,సుధాకర్,కనకరాజు,ప్రేమ్ సాగర్,రవి,సురేందర్,రామకృష్ణ,రామ్ సాయి,రవీందర్,సిద్దు తదితరులు పాల్గొన్నారు.


