డఫోడిల్స్ పాఠశాల విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
జిల్లా స్థాయి యువజన ఉత్సవాల్లో డఫోడిల్స్ విద్యార్థుల ప్రతిభ ..
మొత్తం 128 ప్రాజెక్టుల్లో డఫోడిల్స్ విద్యార్థులకు 1వ,4వ స్థానాలు..
రాష్ట్ర స్థాయికి ఎంపికైన వరంగల్ జిల్లాలో ఏకైక పాఠశాల ప్రాజెక్ట్‌గా నర్సంపేట డఫోడిల్స్ పాఠశాల..
వివేకానంద స్ఫూర్తి మనకు మార్గదర్శకం కావాలి – కలెక్టర్ సత్య శారద పిలుపు..!
కాకతీయ, నర్సంపేట టౌన్ : జీవితంలో ఎలాంటి అడ్డంకి వచ్చినా వెనక్కి తగ్గకండి పరీక్షల్లో, లక్ష్య సాధనలో వివేకానంద స్ఫూర్తి మనకు మార్గదర్శకం కావాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద విద్యార్థులకు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో వరంగల్ లోని పోతన ఆడిటోరియంలో స్వామి వివేకానంద జన్మదినం సందర్బంగా జరిగిన యువజన ఉత్సవాల్లో డఫోడిల్స్ పాఠశాల విద్యార్థులు మరోసారి ప్రతిభ చాటి జిల్లాస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించారు. మొత్తం 128 ప్రాజెక్టులలో, డఫోడిల్స్ విద్యార్థులు మొదటి స్థానం మరియు నాలుగో స్థానం సాధించడం విశేషం. అంతేకాక, రాష్ట్ర స్థాయికి ఎంపికైన వరంగల్ జిల్లాలో ఏకైక పాఠశాల ప్రాజెక్ట్‌గా నిలిచినా నర్సంపేట లోని డఫోడిల్స్ పాఠశాల మరోసారి తన కీర్తి పతాకాన్ని ఎగురవేసింది.ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద డఫోడిల్స్ పాఠశాల విద్యార్థుల ప్రదర్శనను ప్రశంసిస్తూ కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ….
మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణలలో ముందుకు వెళ్లే దృఢసంకల్పం కలిగి ఉండాలనీ అన్నారు. చదువుతో పాటు పరిశోధన, క్రీడలు, సేవా భావం ఉంటే మన దేశం అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని వివేకానందుని స్ఫూర్తితో ముందుకు సాగుతున్న ఈ తరహా విద్యార్థులు మన సమాజానికి స్ఫూర్తి ప్రదాతలు. విజయం ఒక్క రోజులో రాదు, దానికి వెనుక కష్టపడే తత్వం, మార్గదర్శకత్వం, నిబద్ధత తప్పనిసరనీ అన్నారు. డఫోడిల్స్ పాఠశాల విద్యార్థులు ఈ మూడు లక్షణాలను తమ ప్రాజెక్ట్ ద్వారా అద్భుతంగా చూపించారనీన్నారు. వారు తయారుచేసిన ప్రాజెక్ట్ వినూత్నత, లోతైన ఆలోచనతో న్యాయనిర్ణేతల మన్ననలు పొందింది అంటూ కలెక్టర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, యువజన & క్రీడల అధికారి అనిల్‌కుమార్, ప్రిన్సిపాల్ భుజంగారెడ్డి, సైన్స్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, జాతీయ యువజన అవార్డు గ్రహీత శ్రీకాంత్, జానపద కళాకారుడు ఆకులపల్లి కరుణాకర్, రాజేందర్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.



