వేరు వేరుగా చెత్తను సేకరించండి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్
శివనగర్ లో శానిటేషన్ తనిఖీల నిర్వహణ
సెట్ బ్యాక్ నిబంధనలు పాటించేలా చూడాలని అధికారులకు ఆదేశం
కాకతీయ, వరంగల్ : ప్రతి ఇంటి నుండి తడి పొడి చెత్తను వేరు వేరుగా సేకరించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. శానిటేషన్ తనిఖీల్లో భాగంగా బల్దియా పరిధి 34వ డివిజన్ శివనగర్ లో కమిషనర్ ఆకస్మికంగా శానిటేషన్ తనిఖీ లతో పాటు పోతన నగర్ లో గల సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ
ప్రతి స్వచ్ఛ ఆటో రూట్ ఆప్టిమైజేషన్ ప్రకారం తిరుగుతుందా? స్వచ్ఛ ఆటో పరిధిలో ఉండే 600 గృహాలకు 4గురు సిబ్బందిని నియమించి వారి విధులు నిర్వహించుకుంటూ స్వచ్ఛ ఆటోకు చెత్తను అందజేస్తున్నారా? లేదో చూసుకోవాలని ప్రజలు తడి పొడి చెత్తను వేరుగా అందించేలా చూడాలని బిల్డింగ్ అనుమతులు మంజూరు చేసే క్రమంలో సెట్ బ్యాక్ నిబంధనలు పాటిస్తున్నారా లేదో పరిశీలించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. స్మార్ట్ గార్బేజి వర్నరబుల్ పాయింట్స్ లేకుండా ప్రతి ఇంటి నుండి చెత్తను విధిగా సేకరించాలని కమిషనర్ అన్నారు. అనంతరం పోతన నగర్ లోగల సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ను సందర్శించి స్వచ్చ ఆటోల పనితీరు కంటైనర్ ల పని విధానంను అడిగి తెలుసుకొని కొత్తగా ఏర్పాటు చేయబోయే బయో కంపోస్ట్ షెడ్ ను కమిషనర్ ఈ సందర్భంగా పరిశీలించారు.
కార్యక్రమంలో ఎంహెచ్ఓ డా.రాజేష్, ఏసిపి ఖలీల్, సానిటరీ సూపర్ వైజర్ గోల్కొండ శ్రీను, ఏఈ హబీబ్, టిపిబిఓ అవినాష్ తదితరులు పాల్గొన్నారు.


