భూ సేకరణ సజావుగా జరిగేలా చర్యలు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
జాతీయ రహదారుల పెండింగ్ పరిహారం చెల్లించాలి
సింగరేణి భూసేకరణపై అధికారులతో రివ్యూ
కాకతీయ, పెద్దపెల్లి : భూ సేకరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు.గురువారం రామగిరి మండల తహసిల్దార్ కార్యాలయంలో సింగరేణి భూసేకరణ అంశంపై అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బుధవారం పేట, రామయ్యపల్లి, ఆదివారం పేట గ్రామాల్లో సింగరేణి సంస్థకు అవసరమైన భూసేకరణ వివరాలు అందాయని తెలిపారు. ఎస్‌డీ సి, ఎంపీడీఓ, తహసిల్దార్, సింగరేణి సంస్థ అధికారులు పరస్పర సమన్వయంతో పని చేసి, ఎటువంటి ఆటంకాలు లేకుండా భూ సేకరణ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రామగిరి మండల పరిధిలోని జాతీయ రహదారులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పరిహార చెల్లింపులు తక్షణం పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.సమీక్షలో మంథని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, రామగిరి తహసిల్దార్ సుమన్, ఎంపీడీఓ, ఎంపీఓ, సింగరేణి అధికారులు తదితరులు పాల్గొన్నారు.


