“వందేమాతరం” స్వరంలో దేశభక్తి జ్వాలలు
స్వాతంత్ర సమరయోధుల రణనినాదం
భారతీయులలో స్ఫూర్తి నింపిన గేయం
హుజురాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా వందేమాతరం గేయాలాపన
కాకతీయ,హుజురాబాద్ :భారతీయుల్లో దేశభక్తి, చైతన్యాన్ని రగిలించిన “వందేమాతరం” గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాల భాగంగా బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో వందేమాతరం గేయాలాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.వందేమాతరం గేయం భారత స్వాతంత్ర సమరంలో కోట్లాది దేశభక్తులలో స్ఫూర్తి నింపింది. బంకించంద్ర చటర్జీ 1875 నవంబర్ 7న రచించిన ఈ గీతం భారత జాతీయ గేయంగా గుర్తింపు పొందింది అని తెలిపారు.వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలను బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాం. నవంబర్ 26 వరకు ప్రతి మండలంలో వందేమాతరం గేయాలాపన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏడాది పొడవునా ఈ కార్యక్రమాలను నిర్వహించనుంది అని చెప్పారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు రావుల వేణు, జిల్లా కార్యదర్శి బింగి కరుణాకర్, గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, గంగిశెట్టి రాజు, రాజిరెడ్డి, యాంసాని శశిధర్, అంకతి వాసు, కొలిపాక శ్రీనివాస్, నల్ల సుమన్, వోడ్నాల చంద్రిక, మోతె తిరుపతి, భూమిరెడ్డి అమరేందర్ రెడ్డి, గూడూరు సత్యనారాయణ రెడ్డి, నాంపల్లి సుమన్, పుల్లూరి శ్రీకాంత్, మోడేపు వినయ్, మునిగంటి నాగరాజు, పల్లె వీరయ్య, మర్రి రవీందర్, చైతన్య రెడ్డి, పున్నం చందర్, కొడిమ్యాల వెంకటేష్, సాల్మోహన్, గొట్టె రవి, తూర్పాటి రాజశేఖర్, యాళ్ల రాజిరెడ్డి, విజయ్ పర్థం, అనిల్ నాయక్ తదితర నేతలు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత ప్రజలు పాల్గొన్నారు.



