సిర్సపల్లి వద్ద రోడ్డు ప్రమాదం
యువకుడి మృతి
కాకతీయ, హుజురాబాద్: హుజురాబాద్ మండలం సిర్సపల్లి ఎక్స్‌రోడ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలైన ఘటన చోటుచేసుకుంది.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం. మంగళవారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో పోతిరెడ్డిపేట గ్రామం నుండి హుజురాబాద్ వైపు యాక్టివా వాహనంపై (టీఎస్ 02 ఎఫ్ ఈ 5804) వస్తున్న నందిపేట హర్షిత్ (18), దాట్ల త్రిశాంత్‌లను సిర్సపల్లి ఎక్స్‌రోడ్ వద్ద గల విరాట్ రైస్‌మిల్ ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని తొలుత హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హనుమకొండలోని చక్రవర్తి హాస్పిటల్‌కు తరలించారు. అయితే హర్షిత్ చికిత్స పొందుతూ బుధవారం రోజున మృతి చెందాడు.మృతుడు నందిపేట శ్రీనివాస్ కుమారుడు. హర్షిత్ తండ్రి ఫిర్యాదు మేరకు హుజురాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


