గొర్రెపొట్టేళ్ల దొంగల అరెస్టు.. 25 వేల నగదు రికవరీ…
నిందితులంతా 25 యేండ్ల లోపు యువకులు…
వరుస దొంగతనాలకు చెక్ పెట్టిన పోలీసులు…
కాకతీయ ఖానాపురం: ఖానాపురం మండలంలో గొర్రెపొట్టేళ్లను దొంగిలిస్తున్న నలుగురి వ్యక్తులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. కొన్నరోజులుగా గొర్రెలను ఎత్తుకెళ్తు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దొంగలను పట్టుకొని.. వాళ్ల నుంచి సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. దొంగల అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను ఖానాపురం ఎస్ఐ రఘుపతి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఖానాపురం మండల కేంద్రంలో రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో పెద్దమ్మ గడ్డ తండా శివారులో నలుగురు యువకులు ఆటోలో 2 గొర్రె పొట్టేళ్లతో ఉండగా.. గత కొన్ని రోజులుగా జరుగుతున్న గొర్రె పొట్టేళ్ల దొంగతనం అనుమానంతో వారిని ఆపి పోలీసులు విచారించగా దాంతో నవభారత్ పాల్వంచకు చెందిన మాలోతు శివ, భూక్య అభిరామ్, గుడిబండ్ల రాము మాల బంజార కు చెందిన ద్రాక్ష సుధాకర్ తామే దొంగతనాలు చేశామని అంగీకరించినట్లు ఎస్ఐ తెలిపారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు అంత 25 ఏళ్ల లోపు వారే. ఇప్పటివరకు పెద్దమ్మ గడ్డ తండాలో మూడుసార్లు 5 గొర్రె పొట్టేలను దొంగలించినట్లు, వీటి విలువ రూ. 39 వేల ఉంటుందని, నర్సంపేట పట్టణంలో 41 స్టీల్ ప్లేట్స్ ను దొంగతనం చేసి ఎత్తుకెళ్తూ వాటిని గుర్తు తెలియని వ్యక్తులకు అమ్ముతూ వచ్చిన డబ్బులతో జల్సాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుండి రూ.25 వేల నగదును రికవరీ చేసినట్లు ఎస్.ఐ తెలిపారు. నిందితుల వద్ద నుండి 4 కేసులకు సంబంధించిన ప్రాపర్టీతో పాటు ఆటో, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను రిమాండ్ నిమిత్తం జ్యుడీషియ కస్టడీకి తరలించినట్లు ఎస్. ఐ రఘుపతి చెప్పారు. ఈ సందర్భంగా నిందితులను చాకచక్యంగా వ్యవహరించి పట్టుకునీ సొత్తును రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ సుమన్ రెడ్డి, సీతారామరాజు, బుర్ర రమేష్, విజయ్, జంపయ్య రమేష్, హోంగార్డు కందికొండ రాంబాబు లను ప్రత్యేకంగా అభినందించారు.



