ఈవీఎం గోదాం పరిశీలించిన అధికారులు
కాకతీయ, కరీంనగర్ : జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను బుధవారం డిఆర్ఓ బి. వెంకటేశ్వర్లు, ఆర్డిఓ కె. మహేశ్వర్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు.డిఆర్ఓ బి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈవీఎంలు, వివిప్యాట్ల భద్రతా ఏర్పాట్లను తరచూ తనిఖీ చేసి సమగ్ర నివేదికలను పంపిస్తున్నామని తెలిపారు. గోదాంలో ఉన్న భద్రతా సిబ్బందితో మాట్లాడి రక్షణా ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు, డ్యూటీ తీరును పరిశీలించి, పోలీస్ గార్డులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అధికారులు ఈవీఎం, వివిప్యాట్ గదుల ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కె. మహేశ్వర్, కాంగ్రెస్ ప్రతినిధి మడుపు మోహన్, బీఆర్ఎస్ ప్రతినిధి సత్తినేని శ్రీనివాస్, బీజేపీ ప్రతినిధి నాంపల్లి శ్రీనివాస్, ఎంఐఎం ప్రతినిధి బర్కత్ అలీ, టిడిపి ప్రతినిధి కళ్యాడపు ఆగయ్య, ఎన్నికల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


