గుండెపోటుతో యువకుడు మృతి
కాకతీయ, పెద్దవంగర : గుండెపోటుతో యువకుడు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర మండలం వడ్డే కొత్తపల్లి గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం సగ్గం ఉపేందర్ (20) బుధవారం మధ్యాహ్నం తన నివాసంలో ఉండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఇంట్లోనే కుప్పకూలిపోయాడు.అతడు చనిపోవడంతో కుటుంబ సభ్యుల ఏడుపు చూచి బంధువులు, గ్రామస్తులు శోకసముద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదఛాయలు కలుముకున్నాయి.


