బాధిత కుటుంబాన్ని పరామర్శించిన టిపిసిసి ఉపాధ్యక్షులు ఝాన్సీరెడ్డి
కాకతీయ, పెద్దవంగర : మండల పరిధిలోని ఉప్పరగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎక్స్ ఎంపిటిసి వేముల వెంకన్న అనారోగ్యంతో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి గ్రామానికి చేరుకొని మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. అనారోగ్యానికి గల కారణాలను మృతుడి కుటుంబాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు.ఆమె వెంట మండల అధ్యక్షులు ముద్దసాని సురేష్, ప్రధాన కార్యదర్శి సైదులు, నాయకులు సోమశేఖర్, గోపాల్ నాయక్,లింగమూర్తి తదితరులు ఉన్నారు.


