epaper
Monday, March 2, 2026
epaper

ఇష్టారాజ్యంగా ఇంట‌ర్ క‌ళాశాల నిర్వహణ

ఇష్టారాజ్యంగా ఇంట‌ర్ క‌ళాశాల నిర్వహణ
లక్షల్లో ఫీజులు.. ల‌క్ష‌ణంగా నిర్ల‌క్ష్యం
ఐఐటీ, మెడికల్ అకాడమీల పేర్లతో దోపిడీ
మచ్చుకైన కనబడని ల్యాబులు, ప్లే గ్రౌండ్ లు
ఫైర్ సేఫ్టీ, పి ఈ టి, మెడికల్ ఎక్విప్మెంట్స్ కు మంగ‌ళం
అనుమతులు లేకుండానే అకాడమీల నిర్వహణ
అకాడమిక్ సంబంధం లేకుండా క్లాసుల నిర్వహణ
అర్హతలు లేని లెక్చర్లల్లోతో క్లాసుల నిర్వహణ
ఖ‌మ్మంలో నిద్ర అవస్థలో ఉన్న ఇంటర్మీడియట్ విద్యాశాఖ

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇష్టారాజ్యంగా ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీల నిర్వహణ జరుగుతోంది. లక్షల్లో ఫీజులను సైతం వసూళ్లు చేస్తూ పేద,మధ్యతరగతి ప్రజానీకాన్ని దోచుకుంటున్నాయి. కాలేజీల నిర్వహణ పేరుతో విద్యార్థులకు తల్లిదండ్రులకు టోకరా వేస్తు తమ కాలేజీల్లో ఉన్నతమైన చదువుల అందిస్తామని మాయమాటలు చెప్తు అందిన కాడికి దండుకుంటున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాలేజీ నిర్వహణ జరపాలంటే ప్రతి కాలేజీలో ప్లే గ్రౌండ్, ల్యాబ్, అర్హత కలిగిన ఉపాధ్యాయులు, పీఈటి, ఫైర్ సేఫ్టీ తదితర అంశాలకు సంబంధించిన నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇవేమీ పట్టనట్లుగా కాలేజ్ నిర్వాహకులు వ్యవహరించడంపై పలు అనుమానాలు బాధిత తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు.

క్వాలిటీ విద్య పేరుతో అధిక ఫీజులు

ప్రైవేట్ కళాశాలలో క్వాలిటీ విద్య పేరుతో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేయడం జరుగుతోంది. విద్యా ప్ర‌మాణాల్లో గాని, నిబంధ‌న‌లు కాని ఎక్క‌డా పాటించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. సంబంధిత శాఖ అధికారులు మామూళ్ల మత్తులో తూగడం వల్ల కళాశాలల యజమానులు చేసే చేష్టలకు అడ్డు అదుపు లేకుండాపోతోంది. ఐఐటీ, మెడికల్ అకాడమీ ల పేర్లతో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆశచూపి కార్పొరేట్ స్థాయి కాలేజీలకు దీటుగా నిబంధనలకు విరుద్ధంగా కాలేజీలు నడపుతున్నారు. ప్రధానంగా ఖమ్మం నగరంలో నడుపుతున్న ప్రైవేట్ అకాడమీ సెంటర్లకు వేటికి కూడా అనుమతులు లేవ‌న్న‌ది విశ్వ‌స‌నీయ వ‌ర్గాల సమాచారం. ఈ కోచింగ్ సెంటర్లకు పలు కాలేజీల విద్యార్థులకు కోచింగులు ఇప్పించి అవి తమ కాలేజీల పేరిట వచ్చిన ర్యాంకులుగా చెప్పుకుంటూ జిమ్మిక్కుల‌కు పాల్ప‌డుతున్నాయి. ఈ విష‌యం గ‌తంలోనూ ప‌లు కాలేజీల విష‌యంలో బ‌య‌ట‌ప‌డ‌టం గ‌మ‌నార్హం. ఏ కాలేజీలో కూడా అనుభవం ఉన్న ఉపాధ్యాయుల కంటే అనుభవం లేనివారే ఎక్కువగా ఉంటున్నారు. క్వాలిటీ విద్యా అందిస్తామంటూ విద్యార్థులను చదువుపేరుతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొన్ని కాలేజీల్లో ఈ వ్యవహారం మరింతగా మితిమీరడంతో ఒత్తిళ్లు తట్టుకోలేని విద్యార్థులు ఆత్మహత్య శరణ్యముగా భావించి మృత్యువు ఒడిలోకి వెళ్లిన సంఘటనలు ఉన్నాయి.

తుంగ‌లో నిబంధ‌న‌లు..

విద్యార్థుల ద్వారా వచ్చిన సొమ్ముతో ప్రతి కాలేజీ యాజమాన్యం అందమైన భవల అంతస్తుల్లో కాలేజీల నిర్వహణ అంటూ నిబంధనలు తుంగలో తొక్కుతూ విద్యార్థులను మూడు నాలుగు అంతస్తులు మెట్లు ఎక్కిస్తూ నరకం చూపుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇక పరీక్షల సమయంలో తమ ర్యాంకుల పరపతి కోసం విద్యార్థులపై లేనిపోని బారాలు మోపుతున్నట్లు తెలుస్తోంది. ఏ కాలేజీ కూడా ప్లే గ్రౌండ్ లేకపోవడం కేవలం చదువుకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తామంటూ ఒత్తిళ్లకు గురిచేయడం సరికాదని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిద్రావస్థలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉండడం వల్లనే ఇదంతా జరుగుతుందని ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ కాలేజీల నుంచి ప్రతి ఏటా అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు మూడుతున్నాయని దీనివల్లే ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ఎన్ని తప్పులు చేసినా అవి ఒప్పులుగా మారుతున్నాయని తెలుస్తుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విశిష్ట సేవలు చిరస్మరణీయం

విశిష్ట సేవలు చిరస్మరణీయం కాకతీయ, కొత్తగూడెం రూరల్ : లక్ష్మీదేవిపల్లి మండల సూపరింటెండెంట్‌గా...

శ్మ‌శాన వాటిక సమస్యపై కలెక్టర్‌కు వినతి

శ్మ‌శాన వాటిక సమస్యపై కలెక్టర్‌కు వినతి ఆక్రమణలు తొలగించాలని సర్పంచ్ మంద కరుణ...

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి అధికారుల‌కు క‌లెక్ట‌ర్ ఆదేశాలు కలెక్టరేట్‌లో ప్రజల అర్జీల స్వీకరణ కాకతీయ,...

సహజ రంగులతో హోళీ జరుపుకోవాలి

సహజ రంగులతో హోళీ జరుపుకోవాలి ఎస్పీ రోహిత్ రాజ్‌ కాకతీయ, కొత్తగూడెం రూరల్: హోళీ...

స్మార్ట్ కిడ్జ్‌లో హోలీ సంబరాలు

స్మార్ట్ కిడ్జ్‌లో హోలీ సంబరాలు ముందస్తుగా రంగుల పండుగ వేడుకలు సహజ రంగులతో చిన్నారుల...

ఇండ్ల మధ్య సెల్ టవర్లు… ప్రజల్లో ఆందోళన

ఇండ్ల మధ్య సెల్ టవర్లు... ప్రజల్లో ఆందోళన రేడియేషన్ భయం... అనుమతులపై అనుమానాలు సాయినగర్‌లో...

శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణంలో పట్టువస్త్రాల సమర్పణ

శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణంలో పట్టువస్త్రాల సమర్పణ కాకతీయ, కారేపల్లి: ఖమ్మం...

ఒత్తిడి లేకుండా పరీక్షలకు హాజరుకండి

ఒత్తిడి లేకుండా పరీక్షలకు హాజరుకండి పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img