హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఉద్రిక్తత
కాకతీయ, హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చివరి దశలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓటమి భయంతో కాంగ్రెస్ నేతలు యూసుఫ్‌గూడ డివిజన్‌లో అల్లర్లు సృష్టిస్తున్నారు అని ఆరోపించారు. పోలీసులు అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



