మిత్రుడి తండ్రి మృతి.. అండగా నిలిచిన స్నేహితులు
రూ.14వేలు అందించిన నేతాజీ గురుకులం 2008-09 బ్యాచ్
కాకతీయ ఖానాపురం: తమతో కలిసి చదువుకున్న తోటి మిత్రుడి తండ్రి హఠాత్మమరణంతో కంగుతిన్న కుటుంబానికి అండగా నిలిచిన ఘటన ఖానాపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఖానాపురం మండల కేంద్రంలోని నేతాజీ గురుకులంలో ఖానాపురం గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి నాగెల్లి అనిల్ తండ్రి నాగెల్లి పుల్లయ్య గుండెపోటుతో హఠాత్మమరణం చెందగా అనిల్ తో విద్యను అభ్యసించిన తోటి మిత్రులు 2008 – 09 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు కష్టంలో ఉన్న మిత్రుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం తమ తరగతి మిత్రుల సహకారంతో రూ.14 వేల నగదును బాధిత కుటుంబానికి అందించి కష్టంలో ఉన్న మిత్రుడికి తమ తోడు ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా అందించారు. ఈ సందర్భంగా సహాయం అందించిన నేతాజీ గురుకులం పూర్వ విద్యార్థులను గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో రహీం పాషా బానోత్ చిరంజీవి, కేశోజు మధు, పసునూరి యుగేందర్, శాఖమూరి వీరప్రసాద్, లింగమూర్తి, కుమార్, తదితరులు పాల్గొన్నారు.


