జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయం
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు: జినుకల రమేష్
కాకతీయ,నర్సింహులపేట: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జినుకల రమేష్ అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు.ఈసందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని మండలంలోని వివిధ గ్రామాలకు 8,50000 రూపాయల విలువగల 35 చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు.డోర్నకల్ శాసనసభ్యులు రామచంద్రు నాయక్ కృషితో మండలాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషిచేయాలన్నారు.కార్యక్రమంలో గ్రామకాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడుదుల రామకృష్ణ,సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడుశ్రీనివాస్,అనిల్,మండల యూత్ అధ్యక్షుడుశ్రీకాంత్,కార్యకర్తలు పాల్గొన్నారు.


