epaper
Thursday, January 15, 2026
epaper

ఢిల్లీ: ఆ భ‌య‌మే బాంబ్ బ్లాస్ట్‌కు కార‌ణ‌మా?

ఢిల్లీ: ఆ భ‌య‌మే బాంబ్ బ్లాస్ట్‌కు కార‌ణ‌మా?

కాక‌తీయ‌, జాతీయం : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సంభవించిన బాంబు పేలుడు దేశాన్ని కుదిపేసింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని కారులో జరిగిన ఈ పేలుడులో ప‌ది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పేలుడు తీవ్రత దృష్ట్యా ఆ ప్రాంతం అంతా ధ్వంసమైంది. అయితే, ఈ ఘటన వెనుక కారణాలపై పోలీసుల దర్యాప్తు కొన‌సాగుతోంది.

పేలుడు జరిగిన రోజునే, ఫరీదాబాద్‌లో ఓ కశ్మీరీ వైద్యుడు అద్దెకు ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారి వద్ద నుంచి సుమారు 360 కిలోల అమ్మోనియం నైట్రేట్, డిటోనేటర్లు, మరియు మందుగుండు సామగ్రి స్వాధీనం అయ్యాయి. ఈ దాడిలో జమ్మూ–కశ్మీర్, హర్యానా, యూపీ పోలీసులు సంయుక్తంగా పాల్గొన్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో, ఢిల్లీలో జరిగిన పేలుడు మరియు ఫరీదాబాద్‌లో పట్టుబడిన గ్యాంగ్ మధ్య స్పష్టమైన సంబంధం ఉన్నట్లు తేలింది.

పేలుడు జరిగిన కారులో ఉన్న వ్యక్తిని పోలీసులు డాక్టర్ ఉమర్ మహ్మద్‌గా గుర్తించారు. సోమవారం పట్టుబడ్డ ఉగ్రవాద ముఠాకు, ఉమర్ మహ్మద్ కు సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఫరీదాబాద్ దాడుల్లో సహచరులు పట్టుబడటంతో ఉమర్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడ‌ని.. తాను కూడా ఎప్పుడైనా అరెస్టవుతాననే భయంతోనే ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు జరిగిన కారులో డిటోనేటర్లు, అమ్మోనియం నైట్రేట్, మరియు ఇంధనం మిశ్రమంగా వాడినట్లు ఫోరెన్సిక్‌ నివేదికలు సూచిస్తున్నాయి.

ఇక పేలుడు జరిగే ముందు ఉమర్‌తో పాటు మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాగంజ్‌, పహార్‌గంజ్‌ ప్రాంతాల్లోని హోటళ్లు, లాడ్జ్‌ల రికార్డులు చెక్‌ చేస్తున్నారు. మ‌రోవైపు పుల్వామాలో ఉన్న డాక్టర్ ఉమర్ కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉమర్ ఏవైనా తీవ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నాడా? గత కొంతకాలంగా ఎవరితో సంప్రదింపులో ఉన్నాడనే అంశాలపై విచారణ సాగుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి

భూ భారతి పేరిట దోపిడీ! మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి జనగామలో రూ.78...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

దేశంలోనే ధనవంతమైన బల్దియా !

దేశంలోనే ధనవంతమైన బల్దియా ! ఆదాయంలో బీఎంసీ రికార్డు..! మేయర్ ఎన్నికల వేళ ప్రత్యేక...

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ జైలు డైరీ చదివానంటూ మద్దతు వివాదంగా మారిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img