వివాహిత పై దాడి
కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని కొమ్ములవంచ గ్రామంలో కత్తిపోట్ల ఘటనతో గ్రామంలో కలకలం రేగింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పార్నంది సునీత పై వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో బోరుగడ్డ రవి కత్తితో దాడి చేయడం జరిగింది.ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వాగ్వాదం తీవ్రరూపం దాల్చి కత్తిపోట్లకు దారి తీసింది.గాయపడిన మహిళను స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై ఎస్సై సురేష్ ను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.


