మాగంటి సునిత ఎమోషనల్ వీడియో..!
జూబ్లీహిల్స్ ఓటర్లకు విజ్ఞప్తి..
కాకతీయ, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ బీఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీత.. ఎమోషనల్ వీడియో రిలీజ్ చేశారు. జూబ్లీహిల్స్ ప్రజల కోసమే తాను రాజకీయాల్లో అడుగు పెట్టాల్సి వచ్చిందని తెలిపారు. సోమవారం విడుదల చేసిన ఓ వీడియోలో ఆమె ఎమోషనల్‌గా మారారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోవైరల్‌గా మారుతోంది. కుటంబ పెద్దను కోల్పోయి, పుట్టెడు దు:ఖంలో ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేను నమ్ముకున్న ప్రజలకు అండగా నిలబడాలనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ ఆశీస్సులతో జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తున్నాని తెలిపారు.
జూబ్లీహిల్స్ ప్రజలకు నా విన్నపం..
కుటంబ పెద్దను కోల్పోయి, పుట్టెడు దు:ఖంలో ఉన్నప్పటికీ ..
మమ్మల్నే నమ్ముకున్న ప్రజలకు అండగా నిలబడాలనే ఉద్దేశ్యంతోనే
కేసీఆర్ గారి ఆశీస్సులతో జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తున్నాను.ఎన్ని ఆటంకాలు ఎదురైనా మొండి ధైర్యంతో ముందుకెళ్తున్న మీ ఆడబిడ్డను… pic.twitter.com/i6mF3p0jjM
— Maganti Sunitha Gopinath (@magantigopimla) November 10, 2025
ఎన్ని ఆటంకాలు ఎదురైనా మొండి ధైర్యంతో ముందుకెళ్తున్న మీ ఆడబిడ్డను గెలిపించుకోవాలంటే నవంబర్ 11న జరిగే ఉప ఎన్నికలో సీరియల్ నంబర్ 3పై నొక్కి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. గోపన్న ఆశయాల్ని నెరవేర్చే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వీడియోలో ఆమెతో పాటు ఆమో ఇద్దరు కూతుళ్లు..కొడుకు ఉన్నారు.


