epaper
Saturday, November 15, 2025
epaper

మార్కెట్ లైసెన్స్ జారీకి ఆలస్యం ఎందుకు..?

మార్కెట్ లైసెన్స్ జారీకి ఆలస్యం ఎందుకు..?
రైతుల పంట కొనుగోలుపై అనిశ్చితి….
మార్కెట్ విధానాలపై ఆందోళన…
చివరికి నష్టపోయేది రైతులే….

కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాలో రైతులు వరి కోతలతో బిజీగా ఉండగా, రైస్ మిల్లర్లకు మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యం కావడంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. రైతులు, వ్యాపారులు సమన్వయంగా పని చేయాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటైన వ్యవసాయ మార్కెట్ కార్యాలయాలు ఇప్పుడు వ్యవసాయదారులకు కొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.

ధాన్యం కొనుగోలుకు కొత్త నిబంధనలు…..

ప్రతి సంవత్సరం కోతల అనంతరం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతుల వద్ద నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలిస్తుంది. అనంతరం రైతుల బ్యాంకు ఖాతాల్లో పంట కొనుగోలు మొత్తాన్ని జమ చేస్తుంది. అయితే ఈ సంవత్సరం ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇకపై ప్రభుత్వం రైస్ మిల్లర్లకు మార్కెట్ లైసెన్స్ తప్పనిసరి చేసింది. జిల్లా మార్కెట్ కార్యాలయం నుండి లైసెన్స్ పొంది, దానిని ఓపీఎంఎస్ (OPMS) పోర్టల్‌లో అప్‌లోడ్ చేసిన రైస్ మిల్లులకు మాత్రమే రైతుల పంట కొనుగోలు మొత్తం ప్రభుత్వం జమ చేయనున్నట్లు స్పష్టం చేసింది.

దరఖాస్తులు పెండింగులోనే…

ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం తీసుకు వచ్చిన నిబంధనల మేరకు జిల్లాలోని అనేక రైస్ మిల్ యజమానులు నెల రోజుల క్రితమే మార్కెట్ లైసెన్స్ కోసం దరఖాస్తులు సమర్పించారు. అయితే ఇప్పటికీ ఆ దరఖాస్తులపై ఎటువంటి స్పందన లేకపోవడం, ఆమోదం తెలపకపోవడం, లేదా లోపాలు ఉన్నట్లయితే అవి తెలియజేయకపోవడం రైస్ మిల్లర్లలో అసంతృప్తి కలిగిస్తోంది. పలుమార్లు మార్కెట్ కార్యాలయాన్ని సంప్రదించినా త్వరలో ఇస్తాం లేదా లైసెన్స్ ఇవ్వడం కుదరదు అనిలా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా కాలయాపన చేస్తుండడంతో రైతులు, మిల్లర్లు ఇద్దరూ అసహనానికి గురవుతున్నారు.

మార్కెట్ లైసెన్స్ లేక రైతులకు డబ్బులు రాకపోవచ్చు..

ప్రస్తుతం మార్కెట్ లైసెన్స్ ఉన్న రైస్ మిల్లులకు మాత్రమే ప్రభుత్వం ధాన్యం పంపే అవకాశం ఉంది. లైసెన్స్ లేని మిల్లులకు ధాన్యం పంపితే, ప్రభుత్వ చెల్లింపులు రాకపోవడంతో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాని ప్రమాదం ఉంది. దీంతో లైసెన్స్ జారీ ఆలస్యం రైతుల పంట కొనుగోలుపై నేరుగా ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడింది. ములుగు జిల్లా వ్యాప్తంగా వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనా, రైస్ మిల్లుల లైసెన్స్ సమస్య వల్ల కొనుగోలు ప్రక్రియ మందగిస్తోంది.

చివరకు రైతులే నష్టపోతారు…..

రైతులు తమ శ్రమతో పండించిన పంటను అమ్మి వెంటనే డబ్బు పొందాలనుకుంటున్నారు. కానీ మార్కెట్ లైసెన్స్ లేనందువల్ల ధాన్యం నిల్వలు పెరగడం, చెల్లింపులు ఆలస్యం కావడం వంటి సమస్యలు తలెత్తవచ్చు అని, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు సదుపాయాలు కల్పించినా, మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యం వల్ల రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ములుగు జిల్లా వ్యవసాయ మేధావులు పేర్కొన్నారు. మార్కెట్ లైసెన్స్ దరఖాస్తులను వేగంగా పరిశీలించి, తగిన అర్హత ఉన్న రైస్ మిల్లులకు తక్షణమే లైసెన్స్‌లు మంజూరు చేయాలని, లైసెన్స్‌లో లోపాలు ఉన్నట్లయితే స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని వారు సూచిస్తున్నారు. లేకపోతే రైతులు పంట అమ్మకానికి అవకాశాలు కోల్పోయి ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
రైతులు తమ పంటకు గాను చెల్లింపులు సకాలంలో పొందలేని పరిస్థితి తలెత్తి, ఖరీఫ్ సీజన్ మొత్తం సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని వ్యవసాయ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పీడీఎస్ బియ్యం పట్టివేత

పీడీఎస్ బియ్యం పట్టివేత కాకతీయ, నర్సింహులపేట : ఖమ్మం నుంచి వరంగల్ వైపు...

రియ‌ల్ వ్యాపారి ఆగ‌డాలు.. అధికారి అండ‌దండ‌లు

రియ‌ల్ వ్యాపారి ఆగ‌డాలు.. అధికారి అండ‌దండ‌లు చేసేది అక్ర‌మ దందా..ప్ర‌శ్నిస్తే బెదిరింపులు..! అనుమ‌తులున్నాయ‌ని బెదిరింపులు ధ‌ర్మ‌సాగ‌ర్...

ప్ర‌జాక‌ర్ష‌క ప‌థ‌కాల‌తో బీజేపీలోకి చేరికలు

వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ కాకతీయ, హనుమకొండ : వర్ధన్నపేట...

భగత్ సింగ్ స్పూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలి

కాకతీయ, కొత్తగూడెం : భగత్ సింగ్ కలలు కన్న సమసమాజ స్థాపనకు...

మేడారం కీర్తి ప్రపంచానికి చాటుతాం

మేడారం కీర్తి ప్రపంచానికి చాటుతాం సమ్మక్క–సారలమ్మల వైభవం తరతరాలకూ నిలిచేలా చేస్తాం వెయ్యేళ్లు శాశ్వ‌తంగా...

ఆత్మ‌గౌర‌వం కోల్పోవ‌వ‌ద్దు

ఆత్మ‌గౌర‌వం కోల్పోవ‌వ‌ద్దు తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే పదవిని గడ్డిపోచలెక్క విసిరిపడేశాం తెలంగాణ.. ప్రజల రక్త...

కేసీఆర్ క‌ట్టించిన ఇళ్ల‌నే ఇస్తున్న‌రు : మన్నె గోవర్ధన్ రెడ్డి

కేసీఆర్ క‌ట్టించిన ఇళ్ల‌నే ఇస్తున్న‌రు `ఇందిర‌మ్మ`పై ఎలాంటి పురోగ‌తి లేదు బీ ఆర్ ఎస్...

పాలకుర్తిలో భక్తుల సౌకర్యార్థం వసతి గృహాలు

పాలకుర్తిలో భక్తుల సౌకర్యార్థం వసతి గృహాలు సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఆలయంలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img