అద్దె చెల్లించలేదు.. ప్రభుత్వ పాఠశాలకు తాళం..!
అద్దె చెల్లించకపోవడంతో ప్రభుత్వ పాఠశాల భవనానికి తాళం వేసిన యజమాని
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్ ప్రభుత్వ పాఠశాల భవనానికి అద్దె చెల్లించని ప్రభుత్వం
దీంతో పాఠశాలకు తాళం వేసిన యజమాని.. వెనక్కి తిరిగి వెళ్లిపోయిన విద్యార్థులు
అద్దె బకాయి నిజమేనని అంగీకరించి,… pic.twitter.com/BiNuQqEre5
— Telugu Scribe (@TeluguScribe) November 10, 2025
కాకతీయ, వెబ్‌డెస్క్ : అద్దె చెల్లించకపోవడంతో ప్రభుత్వ పాఠశాల భవనానికి యజమాని తాళం వేశాడు. ఈ సంఘటనం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్లో జరిగింది. ప్రభుత్వ పాఠశాలను అద్దె భవనంలో నడుపుతుండగా.. నెలలుగా గడిచినా అద్దె మంజూరు కావడం లేదని పేర్కొంటూ యజమాని సోమవారం భవనానికి తాళం వేశాడు. దీంతో పాఠశాలకు వచ్చిన విద్యార్థులు వెనక్కి తిరిగి వెళ్లిపోయారు.


