టెన్త్ విద్యార్థులకు బండి సంజయ్ “మోదీ గిఫ్ట్”.
పరీక్ష ఫీజులు భరించిన కేంద్ర మంత్రి.
జిల్లా విద్యార్థులకు తన వేతన డబ్బులు నుండి రూ.5,45, 375 ల మొత్తం చెల్లించిన బండి సంజయ్.
పరీక్ష ఫీజు మొత్తానికి సంబంధించిన చెక్కును జిల్లా కలెక్టర్ కు అందజేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి.
కాకతీయ, కరీంనగర్ : ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ పరీక్ష ఫీజులు చెల్లిస్తూ కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి మానవతా మూర్తిగా నిలిచారు.
తన వేతన డబ్బుల నుండి రూ. 5,45,375 మొత్తాన్ని కరీంనగర్ జిల్లాలోని 4,847 మంది పదవ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజుల కోసం భరించారు.ఈ మేరకు పరీక్ష ఫీజు మొత్తానికి సంబంధించిన చెక్కును బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి, నాయకుడు గుజ్జు శ్రీనివాస్ లు కలిసి జిల్లా కలెక్టర్‌కు సోమవారం అందజేశారు.ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులందరికీ ఈ ఏడాది పరీక్ష ఫీజులు పూర్తిగా భరించాలని బండి సంజయ్ నిర్ణయించుకోవడం ప్రశంసనీయం. ‘మోదీ గిఫ్ట్’ పేరుతో విద్యార్థుల భారం తగ్గించే నిర్ణయం తీసుకోవడం స్ఫూర్తిదాయకం అన్నారు.అధికార వర్గాల ప్రకారం కరీంనగర్ జిల్లాలో 4,847 మంది పదవ తరగతి విద్యార్థులు ఉన్నారని, వారందరికీ పరీక్ష ఫీజులు బండి సంజయ్ వేతనంలోనుండే చెల్లించినట్లు తెలిపారు.
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో బండి సంజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు.
కరీంనగర్ జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్ష ఫీజులు భరించి చేయూతనిచ్చినందుకు బీజేపీ జిల్లా తరపున ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.


