ఉగ్రదాడుల యత్నం భగ్నం
ప్లాన్ చేసిన ముగ్గురు వ్యక్తుల అరెస్టు
నిందితుల్లో హైదరాబాదీ డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్
కాకతీయ, నేషనల్ డెస్క్ : దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న ముగ్గురిని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్టు చేసింది. ఈ ముగ్గురిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ ఉండటం గమనార్హం. అరెస్టయిన వారిలో అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ (హైదరాబాద్) తో పాటు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరు వ్యక్తులు – ఆజాద్ సులేమాన్ షేక్ మరియు మొహమ్మద్ సుహైల్ మొహమ్మద్ సలీమ్ ఉన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సమీపంలోని టోల్ ప్లాజా వద్ద గుజరాత్ ATS అధికారులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉగ్రదాడులు నిర్వహించడానికి, విధ్వంసం సృష్టించడానికి ఈ బృందం కుట్ర పన్నినట్లు అధికారులు గుర్తించారు. వీరు ఆయుధాలను సరఫరా చేస్తున్నారు, మరియు ‘రిసిన్’ (ricin) అనే అత్యంత విషపూరిత రసాయన ద్రవాన్ని తయారుచేయడానికి కూడా ప్లాన్ చేశారు. అరెస్టయిన వ్యక్తులు ఇస్లామిక్ స్టేట్ – ఖోరాసన్ ప్రావిన్స్ (ISKP) అనే ఉగ్ర సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పాకిస్తాన్ సరిహద్దుల మీదుగా డ్రోన్ల ద్వారా ఆయుధాలు సరఫరా అయినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ముగ్గురిపై గత ఏడాది కాలంగా ATS నిఘా ఉంచింది.


