కాంగ్రెస్ గెలుపు ఖాయం
కాకతీయ, పాలకుర్తి : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం బోరబండ డివిజన్ లో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సీతక్క హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం శ్రేణులు కదం తొక్కాలన్నారు. ప్రజా పాలన ఫలాలను ప్రజలు గమనిస్తున్నారని తమ అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకేనని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమం కొనసాగాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా సంఘాలు, యువజన నాయకులు పాల్గొన్నారు.


