బాధిత కుటుంబానికి పరామర్శ
కాకతీయ, పాలకుర్తి : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మాజీ వార్డ్ మెంబర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొమ్మన బోయిన వెంకన్న తండ్రి ఐలయ్య ఆదివారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు మృతుడి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధితకుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెదగాని సోమన్న, చాపల బాపురెడ్డి, తొర్రూర్ పట్టణ అధ్యక్షుడు సోమరాజశేఖర్, చిత్తలూరి శ్రీనివాస్, జలగం శ్రీనివాస్, వెంకటాచారి, భూసాని రాము, బొమ్మన బోయిన కుమార్, బిక్షం గౌడ్, ముద్దసాని సురేష్, నడిగడ్డ మధు, జర్నలిస్ట్ యాదగిరి నాయక్ తదితరులు ఉన్నారు.
వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో..
కాకతీయ, పాలకుర్తి : తొర్రూరు మండల కేంద్రానికి చెందిన వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు శ్రీనివాస్ కుటుంబాన్ని ఆ సంఘం ఆధ్వర్యంలో పరామర్శించి ఆర్థిక సాయాన్ని అందించారు. వారిలో కత్తి రవీందర్, ఎక్కడి నాగిరెడ్డిక, చీకటి ఎంకన్న, పెరుమాండ్ల రవి, రాయిశెట్టి వెంకన్న, బోడ బాలాజీ, సోమ రాములు, ఎమ్డీ యాకుబ్ అలి, రావిశెట్టి ఉపేందర్, మోడీ సోమనర్సయ్య, మిట్ట కోల లక్ష్మణ్, బొలగాని మహేష్, బలగాని మహేష్ గౌడ్, మాదాసు రాములు ఉన్నారు.


