పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలి
కాకతీయ, నెల్లికుదురు: భారత పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలని జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షుడు కారం ప్రశాంత్ అన్నారు. ఆదివారం స్థానిక అంబేద్కర్ సెంటర్లో ప్రశాంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా జాతీయ మాల మహానాడు జాతీయ కార్యదర్శి ఆశోద భాస్కర్, జిల్లా అధ్యక్షులు చిట్టి మల్ల మహేష్ లు పాల్గొని ‘హలో మాల చలో ఢిల్లీ’ అనే పోస్టర్ ను ఆవిష్కరణ చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ భారత పార్లమెంట్ కు డా,,బీ.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని, అసంఖ్య బద్ధంగా చేసిన ఎస్సీ వర్గీకరణ రద్దు చేసి ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని 20 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సంద అనిల్, ఆశోద యాకూబ్, ఎనమాల రాకేష్, బాణాల సంజీవ, రాంబాబు, బేతమల్ల వెంకటయ్య, వెంకన్న,రామచంద్రు, సమ్మయ్య, ఉపేందర్, వెంకన్న, రమణమయ్య, యాకయ్య, సాయిలు, సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు.


