“ఓటు అమ్మకండి, పిల్లల భవిష్యత్తు ఉరితీయకండి”.
జూబ్లీహిల్స్‌లో స్వతంత్ర అభ్యర్థి కోట శ్యామ్‌కుమార్ వినూత్న ప్రచారం.
కాకతీయ, కరీంనగర్ : జూబ్లీహిల్స్ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోట శ్యామ్‌కుమార్ తన ప్రచారాన్ని వినూత్నంగా ప్రారంభించారు. ప్రజలలో ఆలోచన రేకెత్తించే విధంగా మెడకు ఉరి వేసుకుని ఓట్లు అమ్ముకోవద్దు… మీ పిల్లల బంగారు భవిష్యత్తుని ఉరితీయకండి అంటూ తల్లిదండ్రులకు హృదయవిదారక విజ్ఞప్తి చేశారు.తన ఈ వినూత్న పద్ధతి స్థానికుల దృష్టిని ఆకర్షించింది. రాజకీయాలపై నిర్లక్ష్యంగా ఉన్న యువతను చైతన్యపరచాలని, శుభ్రమైన రాజకీయాల కోసం తనకు మద్దతు ఇవ్వాలని శ్యామ్‌కుమార్ కోరారు.ఓటు పవిత్రమైనది, దానిని అమ్ముకోవడం అంటే మన భవిష్యత్తును తామే నాశనం చేసుకోవడమే అని ఆయన అన్నారు.ప్రజల్లో సందేశాత్మకంగా మారిన ఈ ప్రచారం ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లో చర్చనీయాంశమైంది.


