రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్
కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం
ముఖ్యమంత్రి చిల్లర మాటలు మానుకోవాలి
కాంగ్రెస్ ఓటమిని ఆయనే ఒప్పుకున్నాడు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కేటీఆర్, కిషన్ రెడ్డిని బ్యాడ్ బ్రదర్స్ అని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. సైకో, షాడిజం, రౌడీ బ్రదర్స్ ఎవరైనా ఉన్నారంటే బండి సంజయ్, రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఏ జీవన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలది ఫెవికాల్ బంధం. ముఖ్యమంత్రి రేవంత్ లాగా చిల్లర, థర్డ్ క్లాస్ మాటలు ఎవరైనా మాట్లాడతారా. ఈ ఎన్నికలు రెఫరెండం కాదు అని రేవంత్ రెడ్డి అన్నాడు. సీఎం కాంగ్రెస్ ఓటమిని ఒప్పుకున్నాడు. దమ్ముంటే ఈ ఎన్నికలు తనకు రెఫరెండం అని రేవంత్ చెప్పాలి. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చినప్పుడే కాంగ్రెస్ పార్టీ నైతిక ఓటమి ఖరారు అయ్యింది .. అని జీవన్‌రెడ్డి అన్నారు.
రేవంత్ పదవి పోతది
రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్. రేవంత్, కిషన్ రెడ్డి బర్కతపుర బ్రదర్స్ . రేవంత్ రఘునందన్ రావు బంధం భూకబ్జా బంధం. వాళ్ళది భూభారతి బంధం. కిషన్ రెడ్డి ఇంట్లో పెయింటింగ్ వేశాను అని రేవంత్ రెడ్డి చెప్పాడు. కిషన్ రెడ్డి పిల్లలను స్కూల్ కు తీసుకొని వెళ్ళేవాన్ని అంటావు.
దత్తాత్రేయ పిల్లల్ని స్కూల్లో చేర్పించింది కూడా నువ్వే నాయే. జూబ్లిహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక తరువాత రేవంత్ ముఖ్యమంత్రి పదవి పోతుంది. అందుకే పొంగులేటి బీహార్ కు పోతున్నాడు కానీ రేవంత్ రెడ్డి పోవడంలేదు. రేవంత్ రెడ్డి కి ఓటమి భయం పట్టుకున్నది. గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేసిన ముఖ్యమంత్రి ఇలా ఎవరు ఉండరు.


