రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి
జాతీయ స్థాయికి ఎంపికైన అల్ఫోర్స్ విద్యార్థిని
అభినందించిన కలెక్టర్ పమేలా సత్పతి
కాకతీయ, కరీంనగర్ : రాష్ట్రస్థాయి కళోత్సవాల్లో ప్రథమ బహుమతి సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన అల్ఫోర్స్ ఇ–టెక్నో స్కూల్ విద్యార్థిని శ్రీనిధిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అభినందించారు. విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడం ద్వారా వారు సమాజంలో ఉన్నత స్థానాలను పొందగలరని కలెక్టర్ అన్నారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో విద్యార్థులు అన్ని రంగాల్లో అగ్రగామిగా కొనసాగడం గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎల్లప్పుడూ చేయూతనిస్తూ విద్యా రంగంలో నాణ్యతకు కృషి చేస్తున్న నరేందర్ రెడ్డిని ప్రశంసించారు.ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కళోత్సవాల్లో అల్ఫోర్స్ విద్యార్థిని శ్రీనిధి (9వ తరగతి) పాటల విభాగంలో ప్రథమ స్థానం సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.విద్యా సంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యక్ష బోధన పద్ధతులు అవలంబిస్తున్నామని, వారికి ఇష్టమైన రంగాల్లో నిపుణులచే శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.విజేతకు కలెక్టర్ పమేలా సత్పతి పుష్పగుచ్ఛం అందజేసి, జాతీయస్థాయిలోనూ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


