జెర్రిపోతుల రజనికి డాక్టరేట్
కాకతీయ, జనగామ : జనగామ మండలం ఓబుల్ కేశపూర్ గ్రామానికి చెందిన జెర్రిపోతుల రజనికి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేశారు. సోషియాలజీ డిపార్ట్మెంట్ లో “రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ అండ్ హైజిఎన్.. సోషల్జికల్ స్టడీ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ స్టేట్” అనే అంశం మీద రిటైర్డ్ ప్రొఫెసర్ పి. కమలారావు పర్యవేక్షణలో ఆమె పరిశోధనను పూర్తి చేశారు. ఈమేరకు పిహెచ్డి పట్టాను సాధించి ప్రతిష్టాత్మకమైన గౌరవ డాక్టరేట్ పొందారు. చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు పడినా.. తన వెన్నంటి ఉంటూ ప్రొత్సహించిన అన్న రాజశేఖర్, జీవిత భాగస్వామి పొన్నాల వినోద్ కుమార్ కు, నాకు, నా చదువుకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన తమ్ముడు జెరిపోతుల రఘు , మా గైడ్ ప్రొఫెసర్ కమలారావు మేడానికి కృతజ్ఞతలు అంటూ రజని గుర్తు చేసుకున్నారు


