జన హృదయాలను గెలుచుకున్న రేవంత్ రెడ్డి
కాకతీయ, నెల్లికుదురు: పేద బడుగు బలహీన వర్గాల సబ్బండ జాతుల హృదయాలను గెలుచుకున్న నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదల యాదవరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా శనివారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, నాయకులు, కార్యకర్తలతో యాదవ రెడ్డి కలిసి భారీ కేక్ కట్ చేశారు. యాదవ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో నెల్లికుదురు పట్టణ అధ్యక్షుడు రత్నపురపు యాకయ్య, నాయిని శ్రీపాల్ రెడ్డి, వలబోజు వెంకటేశ్వర్లు, మంద రవి, గోగుల మల్లయ్య, పులి వెంకన్న, పెరుమాండ్ల జగన్ బాబు, హెచ్ అలివేలు, గడ్డం అరుణ్ కుమార్. ఆకుల నర్సయ్య, వెన్నం క్రాంతి రెడ్డి, ఆకుల కొమురయ్య, జిలకర యాలాద్రి, బాలాజీ నాయక్, జి రవి, కృష్ణ, వెంకటేష్, అనిల్, లింగ్య, అశోక్, హెచ్చు రవి, ప్రశాంత్, కిషన్ నాయక్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


